Misc

మెరుపు లాంటి నీ చూపు చాలదా
మేఘమను నా మది నుంచి ప్రేమ వర్షం కురిపించుటకు,
మధురమైన నీ పలుకు చాలదా
నాచే ప్రేమ పాఠాలు వల్లెవేయించుటకు,
చల్లనైన నీ స్పర్ష చాలదా
నశించి పోతున్న ప్రేమజీవికి ప్రానం పోయుటకు.......

నిన్ను అడగలేక,అడగకుందా వుండలేక,నీకై రాస్తున్న తవిక
నీవు కూడా ప్రేమిస్తున్నావని తెలిసి సంతోషించనా
లేక
వ్యక్తి నేను కాలేనందుకు బాధపదనా.....?

నీ ప్రేమను మరువమని చెప్పలేను
నన్ను ప్రేమించమని అడగలేను
కానీ నిన్ను ప్రేమించడం మానలేను
నా ప్రేమను ఇంతకన్నా తెలుపలేను

చూడాలని వున్నా ,వేచివున్నా నీ చూపుకోసం.
మాటాడాలని వున్నా ,వేచివున్నా నీ మాటకోసం.
ఎంతో చేయాలని వున్నా ,వేచివున్నా నీ సైగకోసం.
నా ప్రేమను చెప్పాలని వున్నా,వేచివున్నా నీ ప్రేమకోసం
.........ఇక వేచివుండక రాలేవా ప్రియా నాకోసం..........?

అవాంతరం లేకుండా నిరంతరం తరమంతా ఇలా
నిన్నే చూస్తూ వుండిపోవాలని వుంది ప్రియతమా!
కోరిక తరంలో తీరేనా,లేక వేచియుండనా ఇంకోతరమైనా?

నా వూహకు రూపం నీవు
నా కవితకు పల్లవి నీవు
నా మాటకు అర్థం నీవు
నా పయనానికి గమ్యం నీవు...

ప్రియతమా!
కనిపించీ కనిపించని నా లక్ష్యం చేరనా?
నా మదిలో చెరగని నిన్ను చేరనా?
కనిపించే లక్ష్యాన్నీ ,వలపించే నిన్నూ చేరలేనా?
మొదట నా లక్ష్యం చేరితే నిన్ను చేరగలనో లేదో చెప్పలేను
కానీ.....నీవు నా వెంటే వున్న పిమ్మట
నా లక్ష్యాన్ని కూడా చేరగలనని మాత్రం చెప్పగలను.......

మరువలేని నీ పరిచయం
గెలువలేని నీ అభినయం
వెలకట్టలేని నీ అనునయం
నా మదికి చేసెను తీయని గాయం
వౄధచేసెను నా సమయం
మిగిల్చెను నాకో బాధల వలయం

ప్రియతమా!
నిండు చందమామ యొక్క అందాన్ని కూడా నెలకు ఒకసారి మాత్రమే చూడగలను
కానీ,నిన్ను చూసిన ప్రతిరోజూ నీలో నిందు చందమామను చూదగలను.

అందమైన నీ రూపంతో నా కన్నుల విందు చేయలేవా?
తీయనైన నీ పలుకులతో నా చెవిలో గానమాడలేవా?
కమ్మనైన నీ కురుల పరిమలాలను నా దరిపంపలేవా?
మధురమైన నీ పెదవుల మాధుర్యాన్ని నాకందించలేవా?
కోమలమైన నీ కౌగిలిలో నన్ను బంధిచలేవా?
అతి సున్నితమైన నీ హౄదయాన్ని ,ఒంటరిగా నీకై
వేచియున్న నా హౄదయనికి తోదుగా పంపలేవా?


నా వూహలకే రూపమొస్తే అవి నీ అంత అందంగా వుండాలనీ,
నా వుహలకే చూపు వస్తే అవి నిన్నే చూస్తుండాలనీ ,
నా వూహలకే మాటలొస్తే అవి నేతొనే మట్లాడుతుండాలనీ,
నా వూహలకే రెక్కలొస్తే అవి నీ వైపే ఎగరాలనీ,
నా వూహలకే ప్రాణమొస్తే అవి నీతొనే జీవించాలనీ,
నా వూహలకే చావు వస్తే అవి నీకొసమే చావాలనీ,
................................కోరుకుంతున్నానే చెలీ!




.

0 comments:

Post a Comment